ఇంటి పన్నులు వసూలు స్పెషల్ డ్రైవ్

పయనించే సూర్యుడు రిపోర్టర్ శ్రవణ్ రాజ్ 31.3.2026 ఈ రోజు చోడవరం మండలం నందు ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు యందు ఇంటి పన్ను వసూలు స్పెషల్ డ్రైవ్ నిర్వహించబడింది..అన్ని గ్రామ పంచాయతీలు యందు ఈ నెల 30వ తేదీ లోపుగా 100% ఇంటి పన్ను వసూలు అలాగే లైసెన్స్ ఫీజులు ఇతర బకాయిలు వసూలు పూర్తి చేయాలని గౌరవ జిల్లా కలెక్టర్ వారు ఆదేశించారు.. చోడవరం మండలం నందు ఇప్పటివరకు 10 గ్రామ పంచాయతీల యందు 100% ఇంటి పన్ను వసూలు పూర్తి అయినది…11 గ్రామ పంచాయతీ ల యందు 90% మరియు 7 పంచాయతీల యందు 80% మిగిలిన 4 పంచాయతీల యందు 75% వసూలు పూర్తి అయినది..అందరు పన్ను చెల్లింపు దారులు ఈ నెల 30వ తేదీ లోపుగా పన్ను బకాయి చెల్లింపు చేయాలి అని ప్రభుత్వం ఆదేశాలు ఉన్నవి. ఈ రోజు ప్రత్యేక డ్రైవ్ యందు భాగముగా ఏం.పి.డి. వో.. డిప్యూటీ ఎంపీడీవో అందరు పంచాయతీ కార్యదర్శులు మరియు జూనియర్ అసిస్టెంట్ లు బిల్లు కలెక్టర్లు పాల్గొన్నారు.. ఈ రోజు గోవాడ అంబేరు రుపురం గాంధీగ్రామం చోడవరం గ్రామ పంచాయతీ లు సందర్శన చేయడమైనది.. అందరు 100% పన్నులు చెల్లించాలని విజ్ఞప్తి చేయడ మయినది..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *