
పయనించే సూర్యుడు న్యూస్ మార్చి తేదీ 31 రూలర్ ప్రతినిధి అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు లోయ మండల కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.టీడీపీ పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ అధిష్టానం పార్టీకి విశేష సేవలందించిన నేతలను ప్రత్యేకంగా సన్మానించారు. టిడిపి యూనిట్ ఇంచార్జి, వార్డు సభ్యులు వంతల డేవిడ్, అరకు నియోజకవర్గ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి, క్లస్టర్ ఇంచార్జి ధనాయింకి రమేష్ వంటి నేతలు గతంలో వైసీపీ పాలనలో ఎదురైన సవాళ్లను అధిగమిస్తూ పార్టీ బలోపేతానికి చేసిన కృషికి గుర్తింపుగా సత్కారమొచ్చారు.పార్టీ అధిష్టానం వారి సేవలను గుర్తించి ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించింది. అరకు టీడీపీ ఇంచార్జి, ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ సియ్యారి దొన్ను దొర పుష్పగుచ్ఛాలు, శాలువులతో నాయకులను ఘనంగా సత్కరించారు. సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, పార్టీ అభివృద్ధి, ప్రజలతో అనుసంధానం, ఎన్నికల సమయంలో సమర్థవంతమైన నిర్వహణలో తమ నిబద్ధత ప్రశంసనీయమని తెలిపారు. భవిష్యత్తులో కూడా పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి కొనసాగిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో అరకు నియోజకవర్గ మార్కెటింగ్ చైర్మన్ బొరిబొరి లక్ష్మి, అరకువేలి మండల ప్రెసిడెంట్ లోకోయి మహదేవ్, పెద్దలబుడు పంచాయతీ సర్పంచ్ పెట్టేలి దాసుబాబు, ఎక్స్ మండల అధ్యక్షుడు శెట్టి బాబురావు, హుకుంపేట మండల జడ్పిటిసి సుబ్బారావు, పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు,