గజ్వేల్‌లో ‘ఎస్వీ జ్యూవెల్లరీ’ వన్ గ్రామ్ గోల్డ్ షాపు ప్రారంభం

పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ మార్చ్ 31గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా : గజ్వేల్ పట్టణంలోని నూతన మోడల్ బస్ స్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఎస్వీ జ్యూవెల్లరీ’ వన్ గ్రామ్ గోల్డ్ షోరూమ్‌ను ఖమ్మంపల్లి సర్పంచ్ కరుణాకరన్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆయన తొలి విక్రయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కమ్మ పల్లి సర్పంచ్ కరుణాకరన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, సామాన్య ప్రజలు అసలు బంగారాన్ని కొనలేని పరిస్థితి నెలకొందని, ఇలాంటి తరుణంలో గజ్వేల్ ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన వన్ గ్రామ్ గోల్డ్ నగలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. మహిళలకు నచ్చే విధంగా, లేటెస్ట్ ట్రెండ్‌కు అనుగుణంగా అనేక రకాల డిజైన్లు ఈ షాపులో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా పెళ్లికూతురు అలంకరణకు అవసరమైన నగలు, మహిళలు, యువతీ యువకులు వివిధ శుభకార్యాలకు ధరించే ప్రత్యేక ఆభరణాలు ఇక్కడ లభిస్తాయన్నారు. గజ్వేల్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నాణ్యతతో కూడిన వన్ గ్రామ్ గోల్డ్ నగలు ఇక్కడ సరసమైన ధరలకే లభిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షాపు యాజమాన్యం , నిర్వాహకులు, స్థానిక నాయకులు, మహిళలు, మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *