అన్నారుగూడెంలో మాజీ ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు విస్తృత పర్యటన..

పయనించే సూర్యుడు న్యూస్ :మార్చి 31,తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామానికి చెందిన వేముల గంగరాజు, కృష్ణవేణి దంపతుల కుమారులు పంచకట్టు వేడుక ఆదివారం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు హాజరై ఆ చిన్నారులకు అక్షింతలు వేసి దీవించారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మారెళ్ళ దేవేందర్, పేరసాని నరసింహారావు, సిపిఎం నాయకులు తుమ్మలపల్లి వెంకటేశ్వరరావు, గోన వేలాద్రి తదితరులు ఉన్నారు. నూతన వధూవరులకు ఆశీర్వాదం.. తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాజేష్, ఉదయశ్రీ దంపతుల రిసెప్షన్ వేడుక ఆదివారం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీపీ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు హాజరై నూతన వధూవరులకు అక్షింతలు వేసి దీవించారు. పిల్లాపాపలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు పేరసాని నరసింహారావు, గోన యాలాద్రి తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *