ఐదవ షెడ్యూల్ భూ భాగాన్ని కాపాడండి.

కుటుంబ సర్వేలో నాన్ ట్రైబుల్స్ ఏజెన్సీలోఎటువంటి హక్కులు కల్పించ వద్దు.పోలవరం జిల్లా కలెక్టర్ కి వినతి.

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ మర్చి. 31.2026 సోమవారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ బృందం.కలెక్టర్ పి.జి.ఆర్.ఎస్ నందు కలెక్టర్ కు మరియు జాయింట్ కలెక్టర్ కు వివిధ సమస్యలతో కూడిన వినతి.పత్రాలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ గారితో మాట్లాడుతూ… పోలవరం జిల్లా పూర్తి ఐదవ షెడ్యూల్ భూ భాగంలో కలదని.ఈ ప్రాంతానికి భారత రాజ్యాంగం కల్పించిన. ఐదవ షెడ్యూల్ లోని చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని,భూ హక్కులనుక,ఆదివాసి సంస్కృతిని కాపాడాలని కోరడం జరిగింది.1/70 చట్టం అమల్లో ఉన్న అవి కేవలం పేపర్ కే పరిమితం అవుతున్నాయని.చట్టం ఉల్లంఘించ బడుతుందని ఆయన అన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో పనిచేస్తున్న పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వలన,ఏజెన్సీ ప్రాంతంలోని గ్రామ కంఠం పంచాయతీ భూములు.అన్యక్రాంతమవుతున్నాయని,ఆర్.అండ్.బి అధికారుల నిర్లక్ష్యం వలన ఆర్.అండ్. బి స్థలాలను నాన్ ట్రైబల్స్ ఆక్రమించుకొని వ్యాపార దుకాణలు ఏర్పాటు చేసుకున్నారని తెలియజేశారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వలన ప్రభుత్వ భూములు, ఆదివాసుల భూములు కబ్జాకు గురై ఆదివాసులు కోర్టు చుట్టూ తిరగలేక నాన్ ట్రైబల్స్ నే అనుభవిస్తున్నారని. ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. ఎంతో కష్టపడి కేసులు వేసి ప్రభుత్వ భూములు స్వాధీనం ఆర్డర్లు తీసుకొస్తే రెవెన్యూ,పంచాయతీ అధికారి నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ భూములు ఆక్రమంలోనే ఉండిపోతున్నాయని అన్నారు. ముఖ్యంగా నాన్ ట్రైబల్స్ కి విద్యుత్ మీటర్లు జారీ చేయవద్దని, విద్యుత్ మీటర్లు జారీ చేయడం. వలన మైదాన ప్రాంతాల నుండి ఏజెన్సీలోకి వలసలు వచ్చి వ్యాపారాలు చేస్తున్నారని, అలాగే అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం.వలన ఏజెన్సీలోనే తిష్ట వేస్తున్నారని.ఇది పూర్తిగా 1/70 చట్టానికి విరుద్ధమని ఆయన అన్నారు. జిల్లా వ్యాప్తంగా 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు జరపాలని. రెవెన్యూ అధికారులకు ఉత్తర్వులు దారి చేయాలని, అదేవిధంగా నాన్ ట్రైబల్స్ కి ఎటువంటి. విద్యుత్ మీటర్లు జారీ చేయవద్దని, కుటుంబ సర్వేలో నాన్ ట్రైబల్స్ కి ఎటువంటి హక్కులు కల్పించవద్దని. తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కలెక్టర్ కోరారు. దేవీపట్నం మండలంలో సుమారు 112 వరకు అక్రమ కట్టడాలు గుర్తించి ఇంకా కొలతలేదని, అదేవిధంగా దేవీపట్నం మండలంలో నాన్ ట్రైబల్ విద్యుత్ మీటర్లు పొంది ఉన్నారని.తక్షణమే వాటిని తొలగించాలని జాయింట్ కలెక్టర్ వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. రాజవొమ్మంగి మండలంలో ఏబి కాలనీ వద్ద సుమారు 20 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి మిషన్ల తోటి సదును చేయిస్తున్నారని.తక్షణమే నిలుపుదల చేయాలని ఆయన జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రం అందజేశారు .స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ వారికి ఆదివాసి భూములు కబ్జా చేసిన వారిపై తక్షణం ఎల్.టి.ఆర్ కేసులు నమోదు. చేయాలని కోరుతూ 7 ఎల్.టి.ఆర్ పి కేసులు ఫిర్యాదు చేయడం జరిగింది. దరఖాస్తులు పరిశీలించిన కలెక్టర్, జాయింట్ కలెక్టర్,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వారు తగు చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది .కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు తీగల బాబురావు, ఆదివారం సంక్షేమ పరిస్థితి డివిజన్ కోఆర్డినేటర్ పీఠా ప్రసాద్, బల్లెం గంగాభవాని, కారు అరుణకుమారి, చోడి ఏడుకొండలరావు, పరదా శివరామకృష్ణ, కలీంకోట శ్రీను తదితరులు పాల్గొన్నారు. కుంజ శ్రీను ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *