ప్రభుత్వాసుపత్రిలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పయనించే సూర్యుడు న్యూస్, మార్చి31(ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ):ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు మైరాల నాగేశ్వరరావు మరియు సిహెచ్సి చైర్మన్,మండల ఆర్యవైశ్యుల అధ్యక్షుడు వాగు రాజేష్ ఆధ్వర్యంలో సోమవారం రోగులకు మజ్జిగ పంపిణీ చేశారు.ముందుగా చైర్మన్ రాజేష్ రోగులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు.ఈ సందర్భంగా రాజేష్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆదేశాలతో పట్టణ యువ నాయకులు బోదిరెడ్డి గోపి,ముది నారాయణస్వామి సూచనల మేరకు ప్రతి సోమవారం హాస్పటల్లో మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందని,ఈ వారం కాపుగంటి వెంకటసుబ్బయ్య జ్ఞాపకార్ధంగా కుమారుడు కాపుగంటి మోహన్ కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో మజ్జిగ పంపిణీ చేయడం జరిగిందని అలాగే దాతలు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి హాస్పిటల్ అభివృద్ధికి మరింత కృషి చేయాలి అన్నారు.ఈ కార్యక్రమంలో గొల్లపూడి త్రిమూర్తులు,పాబోలు వినోద్,కాపుగంటి సంధ్య,సాయికుమార్,సాయి తేజ,చలంచర్ల నాగేశ్వరరావు,ఊర నానాజీ,దేవకి హరికృష్ణ,స్కూల్ చైర్మన్ శ్రీను,వాగు బద్రిష్,పులపర్తి శ్రీను,ఆస్పత్రి వైద్యులు సుప్రియ,శిరీష,సిబ్బంది ప్రమీల,చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *