ఆశ వర్కర్లపై నిర్బంధాన్ని ఖండించండి

సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు- శీలం నరరసింహారావు

పయనించే సూర్యుడు మార్చి 31 మధిర ప్రతినిధి మధిర : ఆశ వర్కర్ల రాష్ట్ర కమిటీ సిఐటియు పిలుపుమేరకు మధిర పట్టణంలో ఆశ వర్కర్లు భగత్ సింగ్ సెంటర్ నందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు శీలం నరసింహారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం ఆశా వర్కర్లకు కనీస వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని పని భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహించగా ఆశలపై రాష్ట్ర ప్రభుత్వం లాఠీచార్జ్ చేసి అరెస్టులు చేసి ఆశాలను ఇబ్బందులకు గురి చేయటం ను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా మధిరలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు అయ్యేంతవరకు సిఐటియు ఉద్యమంలో ఆశ వర్కర్లు ఆందోళన నిర్వహిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ నాయకులు సృజన, బాపట్ల లక్ష్మి, రజిని, నాగమణి, లక్ష్మి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *