అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల పోలీస్ వారిచే వాహన, భారీ వాహన డ్రైవర్లకు

అవగాహనా సదస్సు కార్యక్రమం

పయనించే సూర్యుడు, కోరుట్ల మార్చి 31 జగిత్యాల జిల్లా కోరుట్ల లారీ, మరియు వ్యాన్, అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల పోలీస్ వారిచే వాహన మరియు భారీ వాహన డ్రైవర్లకు అవగాహనా సదస్సు కార్యక్రమం నిర్వహించినా అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన జగిత్యాల ఎస్ పి , శ్రీ అశోక్ కుమార్ డి ఎస్ పి , రాములు కోరుట్ల సి ఐ ,గ చిరంజీవి మరియు మున్సిపల్ చైర్మెన్ వసుంధర గంగాధర్ ఎమ్ వి ఐ శ్రీను మొక్కలు నాటారు మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేనలో భాగంగా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ కేంద్రంలోనీ లారీ వ్యాన్ అసోయేషన్ వారి ఆధ్వర్యంలో మొక్కలు నాటారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి భావితరాలకు మంచి భవిష్యత్ అందించాలి మనందరం చూస్తున్నాం ఎండాకాలం వచ్చిందంటే ఉష్ణగ్రత విపరీతంగా పెరుగుతుంది అలాగే వర్షాలు సమిష్టిగా సకాలంలో కురవలన్నా చెట్లే ప్రధాన కారణం ఎన్ని మొక్కలు నాటితే అంతలా పర్యావరణాన్ని మనం కాపాడుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తెలిపారు ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న లారీ అసోసిషన్ చైర్మన్ జగిత్యాల జిల్లా లారీ అసోసియేషన్ ఉప అధ్యక్షులు ఎమ్ డి అన్వార్ అలాగే కోరుట్ల వ్యాన్ అసోసియేషన్ అధ్యక్షులుఎమ్ ఎ .రఫీ మెటపెల్లి లారీ అధ్యక్షులు బి శంకర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు గోపి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *