పయనించే సూర్యుడు: మార్చి 31/26 సత్తుపల్లి రూలర్: రిపోర్టర్:గద్దె.విజయబాబు కల్లూరు మండలం లో గత పదిహేను రోజులుగా వరికోతలు ప్రారంభం అయ్యాయి కానీ ఇప్పటి వరకూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు మరియు రైతులు తమ ధాన్యం అమ్మడానికి కొనుగోలు కేంద్రాలు లేక పోవడంతో దళారులకు ధాన్యం అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది అని దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేశారు.అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవో ఏ రమేష్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు సామినేని హనుమంతరావు,పార్టీ మండల కమిటీ సభ్యులు దోమతొట్టి పుల్లయ్య,పార్టీ నాయకులు నాయుడు చందర్ రావు పాల్గొన్నారు.