ఘనంగా మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ

* దళితుల సమస్యల పరిష్కారానికి అధికారులకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఆదేశం * వంపుగూడ చౌరస్తాలో పూలే, అంబేద్కర్, జగజీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణ * అట్టహాసంగా విగ్రహావిష్కరణ వేడుక.. పాల్గొన్న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి ప్రీతమ్ * అధికారులతో సమీక్ష.. సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే మార్గదర్శకాలు

పయనించే సూర్యడు / మార్చ్ 31/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు కాప్రా సర్కిల్ పరిధిలోని వంపుగూడ చౌరస్తాలో మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలను రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి ప్రీతమ్ సోమవారం ఘనంగా ఆవిష్కరించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు, కాప్రా డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్, మహనీయుల విగ్రహాల ఫౌండర్ పత్తి కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అట్టహాసంగా విగ్రహావిష్కరణ ముందుగా వంపుగూడ చౌరస్తా చేరుకున్న నగరిగారి ప్రీతమ్.. మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహనీయుల ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం వారు చేసిన పోరాటాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. విగ్రహాల ఏర్పాటుకు చొరవ చూపిన పత్తి కుమార్‌ను, కమిటీ సభ్యులను అభినందించారు. అధికారులతో క్షేత్రస్థాయి సమీక్ష విగ్రహావిష్కరణ అనంతరం అదే ప్రాంగణంలో ఎస్సీ ఇంటెలెక్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల అధికారులతో కలిసి దళితులు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, మౌలిక వసతుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. దళితుల నుంచి వచ్చిన వినతులను స్వీకరించి, వాటి పరిష్కారంపై అధికారులను ప్రశ్నించారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని, సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా చూడాలని అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. సమీక్షా సమావేశంలో ఆర్డీఓ రాజేష్ కుమార్, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోసెస్, జవహర్ నగర్ సీఐ సైదులు, కాప్రా రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ స్వర్ణలత, జీహెచ్‌ఎంసీ సీఓ శ్రీనివాస్ రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధుల సందడి ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పజ్జురి పావని మణిపాల్ రెడ్డి, విగ్రహాల ఏర్పాటు కమిటీ సభ్యులు లింగని కృష్ణ, మునిగడప శ్రీరాములు, ఉడతల శ్రీనివాస్ గౌడ్, పుట్ట బిక్షపతి గౌడ్, రమేష్ కృష్ణ, పేరుపల్లి యాదగిరి, రామారం వెంకటేష్ గౌడ్, ఉడతల రాజు గౌడ్, పాతకోటి రామలింగం, సింగం కిరణ్, తులసి నర్సింగ్, సిద్దు, విజయ్, సందీప్ గౌడ్, బిక్షపతి, సత్తయ్య, కృష్ణ, రవీందర్ తదితరులు పాల్గొన్నారు. మహిళా నాయకురాళ్లు పేరుపల్లి మంజుల, దుంప సావిత్రి, సరోజ, మంగమ్మ, శోభా సహా భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *