మాముడూరు లో విద్యార్థి విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ టిడిపి నాయకులు

పయనించే సూర్యుడు మార్చి 31 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) తాళ్లూరి గిరినాయుడు జన్మదిన సందర్భంగా విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేసిన 24 ఎల్ సోమశిల కాలువ అధ్యక్షుడు ఉడత హజరతయ్య మరియు చేజర్ల మండల టిడిపి కోశాధికారి గుత్తా శ్రీధర్ నాయుడు సోమవారం ఆత్మకూరు నియోజకవర్గం సీనియర్ టిడిపి నాయకులు, కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు జన్మదినం సందర్భంగా సోమవారం మాముడూరు గ్రామంలో సేవా కార్యక్రమం నిర్వహించారు.24 ఎల్ సోమశిల కాలువ అధ్యక్షుడు ఉడత హజరత్తయ్య,చేజర్ల మండల టిడిపి కోశాధికారి గుత్తా శ్రీధర్ నాయుడు ఆధ్వర్యంలో ఎంపీపీ, హైస్కూల్‌లో విద్యార్థులకు పెన్, ప్యాడ్, పెన్సిల్, షాప్నర్, ఎరేజర్ వంటి విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం గిరినాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు అవసరమైన విద్యా వస్తువులు అందజేస్తున్నామని తెలిపారు. గ్రామంలోని పాఠశాల అభివృద్ధికి గిరినాయుడు ఎన్నో సేవలు చేసి ఆదర్శప్రాయ నాయకుడిగా నిలిచారని కొనియాడారు. విద్యార్థులు విద్యలో ముందుకు సాగాలని, మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గుత్తా శ్రీధర్ నాయుడు, ఉడత హజరత్తయ్య, గాడిపర్తి విజయ్, టి. సీతారామ రెడ్డి, చల్లా జయరామ రెడ్డి, రాపూరు ప్రభాకర్ రెడ్డి, హరీష్ చౌదరి, తిరుమల రెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి, త్రవగుంట చంద్రమోహన్, ఆరెద్దుల రామకృష్ణయ్య, గొడ్డెటి ప్రసాద్ రెడ్డి, మేకల ప్రసాద్, ఉసురుపాటి శాంతి, నోటి సుబ్బారెడ్డి, చేజర్ల వెంకటరమణయ్య, వెంకటరమణ, హైస్కూల్ విద్యా కమిటీ చైర్మన్ అల్లంపాటి అనిత, ఎంపీపీ విద్యా కమిటీ చైర్మన్. పాఠశాల ఉపాధ్యాయులు. సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *