రాష్ట్రస్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థినికి ఘన సన్మానం

* విద్యార్థినిని సన్మానించిన గ్రామ సర్పంచ్ మర్కలు శివకుమార్.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 31 సాలూర : రాష్ట్ర కవులు కవయిత్రిల జీవిత చరిత్రపై రాష్ట్రస్థాయిలో ఇటీవల వ్యాసరచన పోటీలు నిర్వహించారు.ఈ వ్యాసరచన పోటీలలో సాలూర మండలం హున్సా గ్రామ 10వ తరగతి విద్యార్థిని వడ్ల శ్రావణి పాల్గొన్నారు.వ్యాసరచన పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి మొదటి స్థానాన్ని దక్కించుకుంది.ఈ సందర్భంగా సోమవారం గ్రామ సర్పంచ్ మర్కల్ శివకుమార్ ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేశారు విద్యార్థినిని శాలువాతో ఘనంగా సన్మానించారు పాఠశాల ఉపాధ్యాయ బృందంతో పాటు గ్రామానికి ఈ సందర్భం గర్వకారణం అన్నారు.10వ తరగతి పరీక్షలు జరుగుతున్న సందర్భంగా విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా పరీక్షలు రాసి మంచి ఫలితాలను సాధించాలని గ్రామ సర్పంచ్ కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మురిగె శంకర్ ఉపాధ్యాయ బృందం,విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *