పయనించే సూర్యుడు ప్రతినిధి జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ మార్చ్ 31 పోలవరం జిల్లా చింతూరు డివిజన్ సమావేశంలో ప్రభుత్వ విప్ ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందళం అశోక్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ & క్రిమినల్ కేసులు పెట్టాలని, ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ డివిజన్ చైర్మన్ జల్లి.నరేష్ డిమాండ్ చేసారు. ఒరిశా నుండి ఆంధ్ర ప్రాంతానికి వలస వచ్చి ఎస్టీ బెంతు ఒరియాలుగా చలామణి అవుతూ, తమ ప్రయోజనాలు దెబ్బతీస్తున్న విషయాన్నీ చెప్పుకుందామని, శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టి ఎమ్మెల్యే, ప్రభుత్వ విఫ్ బెందళం అశోక్ వద్దకు వెళ్ళిన ఆదివాసీ నాయకులను ఆఫ్ నాలెడ్జ్ పెలోస్, బ్లడీ బాస్టర్డ్ అంటూ అవమానకరంగా బూతులు తిట్టదమేమిటని, ప్రభుత్వ విఫ్ పదవీ నుండి తొలగించి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ & క్రిమినల్ కేసులు పెట్టాలని కూటమి ప్రభుత్వాన్ని అయన డిమాండ్ చేసారు.వాస్తవానికి ఎమ్మెల్యే వెనకేసుకొస్తున్న వారు ఎస్టీ బెంతో ఒరియాలు కారని, ఒరిశా నుండి ఆంధ్ర ప్రాంతానికి వలస వచ్చిన బిసి-ఎ (వడ్డి) కులానికి చెంది వారన్నారు. వీరు ఆంధ్రలో ఎస్టీ బెంతో ఒరియలుగా చలామణి కావడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికే చాలా మంది ఎస్టీ బెంతో ఒరియాలుగా నకిలీ సర్టిఫికెట్స్ తో ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. వీరిని ఎస్టీ జాబితాలో తీసుకు రావడానికి ఇటివలే అసెంబ్లీ డిప్యూటి స్పీకెర్ రఘు రామ కృష్ణం రాజుగారిని కలిసి, ఎస్టీ బెంతో ఒరియాలుగా గుర్తించాలని ప్రభుత్వ విఫ్ బెందేలం అశోక్ కోరరారు. ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి, ఇతర ఆదివాసి సంఘాల ప్రతినిదులు ఎమ్మెల్యేను కలిసి తమ అభ్యంతరాలు లేవనేత్తారు. తన వద్ద సరియైన సమాదానం లేక, బూతులు తిడుతూ రెచ్చిపొయరు. ఇది ప్రజా ప్రతినిధి లక్షణం కాదని, తక్షణమే ప్రభుత్వ విప్ పదవి నుండి పోలగించాలని కోరారు. ప్రభుత్వ విఫ్ బెందేలం అశోక్ తన రాజకీయ అధికారాన్ని ఉపయోగించి 27 వేల మంది నాన్ ట్రైబల్స్ ని అక్రమంగా ఎఎస్టీలలో కలపాలని చూస్తున్నారని ఆదివాసీ జెఎసి బృందం మండిపడింది. ఎమ్మెల్యే బెందళం అశోక్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ & క్రిమినల్ కేసులు పెట్టాలని, ప్రభుత్వం కేసు నమోదు, చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. ఈ సమావేశం చింతూరు మండల జేఏసీ చైర్మన్ పొడియం రామకృష్ణ, డివిజన్ ప్రచార కార్యదర్శి. సోడి శ్రీను కాకా. సీతరామరయ్య మడివి. రాజు గోరేం రాఘవ, మడకం. బోజ్జి, మడకం రమేష్ తదితరులు పాల్గొన్నారు