సాలురా చెక్ పోస్ట్ మీదుగా భారీ వాహనాలలో అక్రమ ఇసుక రవాణా.

* కళ్ళు మూసుకునే ధోరణిలో పోలీస్ రెవెన్యూ అధికారుల తీరు. * ఉదయం 3 గంటల నుంచి 5 గంటల వరకు వాహనాల తరలింపు. * భారీ వాహనాలలో ఇసుకను తరలిస్తున్న దృశ్యం.

పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 31 సాలూర : మహారాష్ట్ర నుంచి సాలూర చెక్ పోస్ట్ మీదుగా తెలంగాణ రాష్ట్రంలోకి కొందరు భారీ వాహనాలలో అనుమతులు లేకుండా ఇసుకను తరలించి కాసుల వర్షం కురిపించుకుంటున్నారు ఎవరి కంటపడకుండా జాగ్రత్త పడుతూ ఇసుక వాహనాలు తరలి వెళ్తున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతుంది సాలూర మండల తహసిల్దార్ కు వివరణ కోరగా మాకు సిబ్బంది కొరత ఉండడంతో అక్రమ ఇసుక రవాణాను నియంత్రణ చేయలేకపోతున్నామని స్పష్టం చేశారు తహసిల్దార్ చెప్పిన సమాధానం తీరు చూస్తుంటే అక్రమ ఇసుక రవాణాపై మాకు సంబంధం లేదు అన్నట్లుగా ఉంది మండల తహసిల్దార్ కార్యాలయం కూదవేటు దూరంలో ఉన్న రహదారిపై నుంచి ట్రాలీ ఆటోలు,ట్రాక్టర్లలో అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న సందర్భాలు అందరికీ తెలిసిందే.అక్రమ ఇసుక రవాణా విషయంలో ఇక స్థానిక పోలీస్ సిబ్బంది తీరు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందని ప్రజలు వారి వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు మంజీరా నుంచి పడితే బోధన్ పట్టణం దాటి నిర్మాణదారునికి వేసే వరకు దక్షిణలు సమర్పించవలసి ఉంటుందని ఇసుక తరలించే వాహన యజమానులు సైతం పోలీసుల కాసుల బీరసారాలపై బహిర్గతమవుతున్న సందర్భాలు లేకపోలేదు ఈ విధంగా దక్షిణలు సమర్పించుకుంటూ ఇసుక వినియోగదారుడికి చేరేవరకు ఇసుక ధర ఆకాశాన్ని అంటుతుంది పోలీస్ మరియు రెవెన్యూ అధికారులు కళ్ళు అప్పగించి చూస్తున్నారే తప్ప సిబ్బందిని మందలించకపోవడంపై అనేక కోణాలలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇప్పటికైనా పోలీసు మరియు రెవెన్యూ శాఖల అధికారులు కళ్ళు తెరిచి అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్న అక్రమార్కులు మరియు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *