నర్సింగ్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో సూపర్డెంట్ డాక్టర్ ఉషారాణి,హెడ్ నర్స్ కృష్ణవేణి కి ఘన సన్మానం .

పయనించే సూర్యుడు మార్చి 31 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ ఇటీవల దేశవ్యాప్తంగా నవజాత శిశు ఆరోగ్య సేవలు అందించడంలో ఎంపికైన 8మంది ప్రముఖ పిడియాట్రిక్ విభాగంలో నియోకన్ ఫెలోషిప్ 44 వార్షికోత్సవం కలకత్తా లో జరిగిన జాతీయ సదస్సులో అవార్డు పొందిన నాగర్ కర్నూలు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ తోట ఉషారాణికి,ఇటీవల పదోన్నతి పొందిన కృష్ణవేణికి జిల్లా నర్సింగ్ ఆఫీసర్ ల ఆధ్వర్యంలో సోమవారం నాడు ప్రభుత్వ సాధారణ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారిని శాలువలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో సర్జికల్ విభాగాధిపతి డాక్టర్ ఆర్. రఘు,ఆర్.ఎం.ఓ డాక్టర్ ఏ.రోహిత్,నర్సింగ్ సూపర్డెంట్లు మంజుల,పెర్సీ సుమన్,హెడ్ నర్సులు అమృత,పద్మ, నర్సింగ్ ఆఫీసర్ల జిల్లా అధ్యక్షులు జానకి దేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ఆనంద్, నర్సింగ్ అధికారులు సరస్వతి, అనురాధ, సునీత, కేశవ్, అంజి, సునీత ఇతర నర్సింగ్ అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *