ప్రవీణ్ చక్రవర్తికి గౌరవ పురస్కారం అందజేసిన ఎమ్మెల్యే నానాజీ..

పయనించే సూర్యుడు మార్చి 31, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) సైలోమ్ బ్లైండ్ సెంటర్ (ఎస్బిసి) సంస్థ అధినేత ఎస్ ప్రవీణ్ చక్రవర్తి కి ఎమ్మెల్యే నానాజీ చేతుల మీదుగా గౌరవ పురస్కారం.. సేవ మూర్తి సైలోమ్ బ్లైండ్ సెంటర్ ఎస్బిసి సంస్థ అధినేత ఎస్ ప్రవీణ్ చక్రవర్తికి బిఫోర్ స్వర్ణాం ధ్ర కార్యక్రమంలో భాగంగా గౌరవ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ మండలం కార్యాలయంలో ఎమ్మెల్యే అధ్యక్షతన ఆయన చేతుల మీదుగా గౌరవ పురస్కరణ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ బంగారు కుటుంబాల కోసం మార్గదర్శకంగా కుటుంబాలను దత్త తీసుకుని అభివృద్ధి చేయడంలో భాగస్వామ్యం అయినందుకు ప్రవీణ్ చక్రవర్తికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడుతూ పేద మరియు అవసరమైన పిల్లలకు విద్య నివాసం ఆహారం అందించడం ద్వారా సమాజంలో మార్పు తీసుకొస్తుంది అదే విధంగా గర్భిణీ స్త్రీలు మరియు హెచ్ఐవి ప్రభావిత పిల్లలకు పోషకాహార కిట్లు వృత్తి శిక్షణ కార్యక్రమాలు మరియు మానవతా సహాయం ఇటువంటి కార్యక్రమాలను ప్రభుత్వ శాఖలతో సమన్వయంతో నిర్వహిస్తున్నామని అన్నారు. అలాగే తమ సేవలను మరింత విస్తరించి ఎందుకు ప్రయాణం ఇస్తుందని భవిష్యత్తులో కూడా సమాజానికి మరింత సేవ చేయడానికి ముందు ఉంటారని ప్రవీణ్ చక్రవర్తి తెలియజేశారు. నాకు గౌరవ పురస్కారం అందజేసిన ఎమ్మెల్యే కి నాకు సహరించిన వారందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సహకరించిన జనసేన సీనియర్ నాయకులు పాండ్రంకి రాజు మరియు పి. ఫోర్ సిబ్బంది సురేష్ , విహారిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *