పయనించే సూర్యుడు మార్చి 31 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం నూతన కమిటీని ఘనంగా ఏర్పాటు చేశారు. గ్రామ యువకుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘానికి కొత్త నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడిగా డొక్కా రాజేష్‌ను ఎంపిక చేశారు. ఉపాధ్యక్షుడిగా జక్కి బాబు, ప్రధాన కార్యదర్శిగా మ్యాతరి కురుమూర్తి బద్రి నియమితులయ్యారు. ప్రచార కార్యదర్శిగా తుమ్మకుమ్మ ఆంజనేయులు, సహాయ కార్యదర్శిగా మాజీ ఎంపీటీసీ భూషణ్ బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా వీరస్వామి, సుదర్శన్, చంద్రశేఖర్, చెన్నయ్య, శ్రీనివాసులు, హుస్సేన్, రామస్వామి, రాజు, నాగయ్య, మ్యాతరి నాగేష్ తదితరులు కమిటీలో సభ్యులుగా కొనసాగనున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కొత్త కమిటీకి అభినందనలు తెలిపారు. సంఘం ద్వారా గ్రామ అభివృద్ధికి మరియు యువత సంక్షేమానికి కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.