
పయనించే సూర్యుడు మార్చి 31, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) రాజమండ్రిలోని ధర్మంచర కమ్యూనిటీ హాల్ నందు సెంటలైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు గ్రహీత అనపాల ఆంజనేయులురెడ్డి కు శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని నిర్వహించిన ఘన కార్యక్రమంలో కాకినాడ జిల్లాకు చెందిన,ప్రముఖ సామాజిక సేవకుడు, ఆంధ్ర శ్రీ సేవా రత్న అనపాల ఆంజనేయులు రెడ్డి కు తెలుగు స్వర్ణ నంది పురస్కారాలు అవార్డు గ్రహీత – 2026”**ను ప్రదానం చేశారు. సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతి, మానవతా సేవలు, సేవాభావంతో నిరంతరం చేస్తున్న విశేష కృషికి గాను ఈ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమాన్ని పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించగా, సంస్థ వ్యవస్థాపకులు అద్దంకి రాజా, ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య అతిథి శాసన మండలి సభ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షులు , చేతుల మీదుగా అనపాల ఆంజనేయులు రెడ్డి కు అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా మీడియం బాబూరావు మాజీ పార్లమెంట్ సభ్యులు హాజరయ్యారు. ,, కళారత్న కత్తిమండ ప్రతాప్ తదితర రాజకీయ, విద్యా, సాంస్కృతిక, సామాజిక రంగ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ, పరాభవ నామ సంవత్సరం అనపాల ఆంజనేయులు రెడ్డి చేస్తున్న సేవలు యువత, పెద్దవారికి, వృద్ధులకు స్వచ్ఛంద సంస్థలకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. విద్య, ఆరోగ్యం, పేదల సంక్షేమం, మానవీయ విలువల పరిరక్షణలో ఆయన చేస్తున్న సేవలు సమాజానికి దిశానిర్దేశకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. అవార్డు స్వీకరించిన అనంతరం అనపాల ఆంజనేయులు మాట్లాడుతూ, ఈ గౌరవం తన ఒక్కరిది కాదని, తనతో పాటు పనిచేసిన ప్రతి స్వచ్ఛంద సంస్థ , సేవాభిమానులు, సంస్థశ్రేయోభిలాషులకు చెందిందని తెలిపారు, స్వామి వివేకానంద జీవిత చరిత్ర నేటి యువత, పెద్దవారు వృద్ధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రతిఒక్కరూ తెలుసుకుని ఆయన ఆశయాలను పాటించాలని తెలిపారు. భవిష్యత్తులో మరింత విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఈ సందర్బంగా సన్నిహితులు, లాయర్ శ్రీనివాస్, కందిపల్లి సతీష్, సాయి రాంబాబు, వరద శ్రీనివాసరావు, కుటుంబసభ్యులు అనపాల ఆంజనేయులు రెడ్డి కు అభినందనలు తెలియజేసారు.