కమ్మలదిన్నెలో పీఎం ఆవాస్ గృహాల ప్రారంభం

మంత్రాలయం టీడీపీ ఇంచార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి, యువ నాయకుడు ఎన్. రాజారెడ్డి పాల్గొన్నారు

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 31 రిపోర్టర్ అభి పెద్దకడబూరు మండలం కమ్మలదిన్నె గ్రామంలో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన గృహాల ప్రారంభోత్సవం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం టీడీపీ ఇంచార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి, యువ నాయకుడు ఎన్. రాజారెడ్డి పాల్గొని లబ్ధిదారులకు గృహాలను ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు. వివరాల ప్రకారం, పథకం కింద నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందజే సి తాళాలు అప్పగించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తక్కువ కాలంలోనే గృహాల నిర్మాణాన్ని పూర్తి చేసి పేదలకు అందించడం సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *