గ్రామ పంచాయతీ అభివృద్ధే నా ధ్యేయం

* గ్రామ సర్పంచ్ - ఇస్లావత్ రవీందర్ నాయక్

పయనించే సూర్యుడు, మార్చి 31 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల శంకర్ కొండ తండా గ్రామ సర్పంచ్ ఇస్లావత్ రవీందర్ నాయక్ శనివారం సీసీ రోడ్డు కు భూమి పూజ చేసి సీసీ రోడ్డు పనులు ప్రారంభించారు. గ్రామపంచాయతీ అభివృద్ధి నా లక్ష్యంగా చేసుకొని ఉపాధి హామీ పథకం కింద మంజూరైన సిసి రోడ్ల లేని తండాలకు సిసి రోడ్ లు నిర్మించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వడ్డావత్ పరమేశ్వరివిజయ్, ఇస్లావత్ కేస్య నేనావత్ శ్రీను, ఇస్లావత్ రవి, నేనావత్ కళ్యాణ్, సభావత్ లక్ష్మి రాములు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *