పయనించే సూర్యుడు న్యూస్ మార్చ్ 31 సాలూర : సాలూర మండల కేంద్రంలో సాలుర లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై బోధన్ రూరల్ ఠాణా పోలీసులు పక్క సమాచారం మేరకు సోమవారం దాడులు చేశారు.ఎస్ఐ మచ్చేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పేకాట స్థావరంపై దాడులు నిర్వహించి 6గురు పేకాటరాయుల్లను పట్టుకొని వారి వద్ద నుంచి 10 వేల 10 రూపాయల నగదు,3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు పేకాట ఆడినట్లయితే చట్టపరమైన చర్యలతో పాటు జరిమానా జైలు శిక్ష అనుభవించవలసి వస్తుందని ఎస్ఐ హెచ్చరించారు.