పయనించే సూర్యుడు ఏప్రిల్ 01(ఘట్కేసర్ వెంకటరెడ్డి ) రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో మహిళల సేవలను గౌరవిస్తూ ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఘట్‌కేసర్ డివిజన్ బస్ స్టాప్ వద్ద మహిళల సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు సుమారు 290 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు చేయగా దాని ద్వారా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సుమారు 10,000 కోట్ల ప్రయాణ చార్జీల ఆదా జరిగిన సందర్భంగా రాష్ట్ర మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వ ఆసుపత్రి నర్సులు కళాశాల విద్యార్థినులను కలుపుకొని ఐదుగురు మహిళలను ఘనంగా సన్మానించారు తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ ఘట్కేసర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిడ్ల ముత్యాలు యాదవ్ ఘట్‌కేసర్ మున్సిపల్ మాజీ చైర్మన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈగ శ్వేత బొక్క ప్రభాకర్ రెడ్డి ఆంజనేయులు రాధాకృష్ణ ఆర్టీసీ అధికారులు మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.