రేపే అంకమ్మ జాతర ప్రారంభ

* అధికంగా పాల్గొననున్న,ప్రజా ప్రతినిదులు,ప్రజలు, భక్తులు ... * రెండు తెలుగు రాష్ట్రాల నుండి అశేషంగా పాల్గొననున్న భక్తులు. * ఐదు రోజులు మినీ మేడారంగా మారనున్న అన్నారుగూడెం.. * భక్తుల సౌకర్యార్థం హెల్త్ మరియు సంరక్షణ క్యాంపులు ఏర్పాటు.. * పోలీస్ బందోబస్తు, జాతర వారియర్స్ టీం నిత్య పర్యవేక్షణ. * దేవాలయ కమిటీ చైర్మన్ దొడ్డ శ్రీనివాసరావు వెల్లడి ...

పయనించే సూర్యుడు న్యూస్ :ఏప్రిల్ 1,తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నారుగూడెం గ్రామంలో తల్లాడ మాజీ ఎంపీపీ, మరియు అంకమ్మ దేవాలయ కమిటీ చైర్మన్ దొడ్డ శ్రీనివాసరావు నేతృత్వంలో ప్రతి సంవత్సరం అంకమ్మ, మహాలక్ష్మమ్మ, మద్దిరావమ్మ ల జాతర అంబరాన్ని తాకేలా ఐదు రోజులు జరిగే సంగతి అందరికీ విధితమే. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 1 వ తారీకు నుండి 5 వ తారీకు వరకు అనగా బుధవారం నుండి ఆదివారం వరకు 1 వ తారీకు ఉదయం మంగళ తోరణాలు, తోరణ పాకు కట్టుట, విఘ్నేశ్వర పూజ కార్యక్రమం, సాయంత్రం 9.0 గంటలకు అమ్మవార్ల ఊరేగింపు.2 వ తారీకు అమ్మవార్లను ఉయ్యాల ఊపుట, రాత్రి జల బిందెలతో ఊరేగింపు కార్యక్రమం.3 వ తారీకు కుంకుమ పూజ, అన్నదాన కార్యక్రమం,రాత్రి పూల కప్పెర ఊరేగింపు.4 వ తారీకు కుంకుమార్చన, గోత్ర నామాలతో పూజలు, బోనాలు సమర్పణ,వాహన పూజ,అన్నదాన కార్యక్రమం, సాయంత్రం గండ దీపములు. 5 వ తారీకు ఉదయం అమ్మ వార్ల దివ్య దర్శనం,మొక్కలు తీర్చుట,అన్నదాన కార్యక్రమం, మధ్యాహ్నం అత్యధిక ప్రభలతో ఊరేగింపు, అదే విధంగా ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు, హైదరా బాద్ మ్యూజికల్ హిట్స్ సినీ పాప్ సింగర్స్ తో కార్యక్రమం, డ్యాన్స్ పోటీలు, పాటల పోటీలు, మరెన్నో వినోదాత్మక కార్యక్రమాలతో ఈ జాతర జరుగును.ఈ జాతర సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయని కావున భక్తులు ఈ ఐదు రోజులు జరిగే అంకమ్మ జాతరలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని దేవాలయ కమిటీ చైర్మన్, తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *