పయనించే సూర్యుడు న్యూస్ :ఏప్రిల్ 1 ,తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండల పరిధిలోని గోపాలపేట గ్రామ సర్పంచ్ తాళ్ల సుధారాణి వెంకటేశ్వర్లు రాబోయే వేసవి ఎద్దడిని తట్టుకునేందుకు గ్రామంలోని బోర్లకు మరమ్మత్తులు చేయించి బిగించి గ్రామంలో మంచినీటిని సరఫరా చేసేందుకు మంగళవారం సమాయత్తం అయ్యారు, వేసవిలో నీటి ఎద్దడిని తట్టుకునేందుకు ముందస్తు ప్రణాళికతో సర్పంచ్ చేపట్టిన ముందస్తు చర్యలకు గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శనక్కాయల సత్యనారాయణ, నున్నా పెద్ద తిరుమల రావు, కొమ్మునేని శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి ఉషారాణి,గ్రామ పంచాయతి సిబ్బంది. గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.