పయనించే సూర్యుడు01-04-2026 అనకాపల్లి జిల్లా రిపోర్టర్: శ్రవణ్ రాజ్ మాడుగుల వ్యవసాయ మార్కెట్ కమిటీ వారి సౌజన్యంతో పశు సంవర్ధక శాఖ వారు ఉచిత మెగా పశువైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు గారు అధ్యక్షత వహించారు. ఈ శిబిరానికి మాడుగుల ఏరియా పశు వైద్యశాల సహాయ సంచాలకులు డా. చిట్టి నాయుడు పెద్ద గోవాడ,పశు వైద్యాధికారి డా. మణి లక్ష్మణ్, కండివరం పశు వైద్యాధికారి డా. ఏ సి ఎచ్ గణేష్ రెడ్డి, చీడికాడ వైద్య అధికారిని డాక్టర్, కే, రాఘవమ్మ,వైద్య సేవలు అందించారు. ఇందులో భాగంగాఏ ఎమ్ సి వైస్ చైర్మన్ గోవింద్, చిడికాడ టిడిపి మండల పార్టీ అధ్యక్షులు పోతల చిన్నం నాయుడు , గ్రామ సర్పంచ్ మధ్య లక్షణమ్మ దేవానంద్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు జేవీఎస్ ప్రసాద్ మార్కెట్ కమిటీ కార్యదర్శి, ఎస్ బంగార్రాజు గారు పాల్గొన్నారు. పాల సంఘం అధ్యక్షులు పేరపు కొండబాబు, ఎంపిటిసి సుంకరి తిరుమల నాయుడు,ఎల్ ఎస్ ఏ సంతోష్ , పశుసంవర్ధక సహాయకులు, జె, సత్య, S. గంగ నాయుడు, కి. రాజేష్ ఎం, శ్రీనివాసరావు కె ,అర్జున్ మూర్తి, పాడి రైతులు గ్రామంలో ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు. శిబిరానికి హాజరైన పశువుల చికిత్స ల వివరాలు : లబ్ధి పొందిన పాడి రైతులు -62 ఆవులు -45 గేదెలు – 32 గొర్రెలకు మరియు మేకలకు-70 1) గర్భకోశ చికిత్సలు – 42 2) చూడి పరీక్షలు – 22 3) నట్టల నివారణ -30 4)గాలికుంటు వ్యాధి టీకాలు -88 4) ఎదకి రాని పశువులు – 28 5) 70 గొర్రెలకు మరియు మేకలకు పాములు మందు పంపిణీ చేయడం జరిగింది. ఈ శిబిరాన్ని ఉద్దేశించి చైర్మన్ మాట్లాడుతూ పశువుల్లో వచ్చే గర్భకోశ వ్యాధులకు అశ్రద్ధ చేయకుండా సకాలంలో వైద్యం చేయించుకోవాలని అలాగే లేగదూడలకు సకాలంలో ఏలిక పాము మందులు పట్టాలని, చూలు కట్టని ఆవులకు, గేదెలకు ఈ శిబిరంలో అందించే ఉచిత వైద్య సేవలు ఉపయోగించుకోవాలని సూచించడం జరిగినది. సుమారు 60 మంది పాడి రైతులకు ఉచితంగా మినరల్ మిక్చర్ పాకెట్లు, లివర్ టానిక్ లు ఇవ్వడమైనది. అనంతరం డా. చిట్టినాయుడు మాట్లాడుతూ పశువులలో వచ్చే గర్బకోశ వ్యాధులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే పశువులకు లింగ నిర్ధారిత వీర్యాన్ని ఉపయోగించి పశువులకు చూలు కట్టించుకోవాలని సూచించడం జరిగింది. డా. మని లక్ష్మణ్ మాట్లాడుతూ వేసవి లో పశువుల పెంపకం మరియు యాజమాన్య పద్ధతులు రైతులకు వివరించారు.