నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి: డాక్టర్ ఎ. చంద్రశేఖర్

పయనించే సూర్యుడు ఏప్రిల్ 1 (సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ప్రతినిధి స్వాతి.నర్సిములు): ఆపదలో ఉన్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక గొప్ప వరమని, అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి ఈ నిధి కొండంత అండగా నిలుస్తుందని మాజీ మంత్రి, జహీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్-చార్జ్ డాక్టర్ ఎ. చంద్రశేఖర్ పేర్కొన్నారు.డాక్టర్ చంద్రశేఖర్ ఆదేశాల మేరకు, జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జహీరాబాద్, న్యాలకల్, కోహిర్, ఝరాసంగం, మొగుడంపల్లి మండలాలకు చెందిన 40 మంది లబ్ధిదారులకు మంజూరైన ₹ 18,35,500/- (పద్దెనిమిది లక్షల ముప్పై ఐదు వేల ఐదు వందల రూపాయల) విలువైన సహాయ నిధి చెక్కులను స్థానిక నాయకులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రాణాపాయ స్థితిలో ఉండి సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న వారు, తమ వైద్యానికి సంబంధించిన పత్రాలను ప్రభుత్వానికి సమర్పిస్తే ఈ నిధి ద్వారా ఆర్థిక వెసులుబాటు కలుగుతుందని వివరించారు. లబ్ధిదారులు ఈ సహాయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ డాక్టర్ చంద్రశేఖర్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ అధ్యక్షులు రామలింగారెడ్డి, మండల అధ్యక్షులు హన్మంతరావు పాటిల్, శ్రీనివాస్ రెడ్డి, గ్రామ సర్పంచులు వీరారెడ్డి, రాజ్ కుమార్, సంతల కమిటీ ఉపాధ్యక్షులు తిరుపతి రెడ్డి, సత్వర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, ఇప్పేపల్లి మాజీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు రాములు, శేఖర్, విష్ణు, ఫైజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *