పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా.. జగయ్యపేట్ట నియోజకవర్గం. 01-04-2026 పెనుగంచిప్రోలు.. గ్రామంలో ని ఈరోజు న. పెనుగంచిప్రోలు తుఫాన్ కాలనీలోని మండల పరిషత్ మోడల్ ప్రైమరీ స్కూలుని తనిఖీ చేసి, మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి,జీఎఫ్ఎల్ఎన్ తుది పరీక్షను పరిశీలించి, అంగన్వాడి కేంద్రం నుంచి ఐదు సంవత్సరాలు నిండిన ఆరుగురు పిల్లలను ఒకటవ తరగతి లోనికి చేర్పించి విద్యార్థులకు ఆత్మీయ ఆహ్వాన స్వాగత అభినందనలు తెలియజేసిన పెనుగంచిప్రోలు ఎంఈఓ రవీందర్ నాయక్, ఎంఈఓ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఐదు సంవత్సరాల నిండిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కాంత, పాఠశాలలోని ఉపాధ్యాయులు, సిఆర్పి గోపాల్,అంగనవాడి టీచర్ మరియు సహాయకురాలు పాల్గొన్నారు.
