అనారోగ్యంతో మరణించిన బాబీ కుటుంబానికి అండగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 1 అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ సురేష్ అనారోగ్యంతో అకాల మరణం చెందిన కుతుకులూరుకు చెందిన మేడవరపు బాబీ కుటుంబాన్ని అనపర్తి మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి సోమవారం పరామర్శించారు. కుటుంబ పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న భార్య, ముగ్గురు చిన్న పిల్లలను ఆయన ఓదార్చారు.రూ. 1.90 లక్షల భారీ ఆర్థిక సాయం:పేదరికంలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కుతుకులూరు గ్రామ వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక దాతలు మానవత్వంతో స్పందించి రూ. 1.90 లక్షల విరాళాన్ని సేకరించారు. ఈ మొత్తాన్ని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు.పిల్లల భవిష్యత్తుకు భరోసా:పిల్లల చదువు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని, సేకరించిన విరాళం నుండి రూ. 1,80,000లను ముగ్గురు పిల్లల పేరు మీద (ఒక్కొక్కరికి రూ. 60,000 చొప్పున) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయించారు. మిగిలిన రూ. 10,000 నగదును కుటుంబ తక్షణ అవసరాల నిమిత్తం అందజేశారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న ఒక పేద కుటుంబాన్ని ఆదుకోవడానికి గొప్ప మనసుతో ముందుకు వచ్చిన దాతలను, పార్టీ శ్రేణులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *