కూటమి ప్రభుత్వం అంగన్వాడీ లకు జీతాలు పెంచాలి

సిఐటియు డిమాండ్

పయనించేసూర్యుడు న్యూస్ ఏప్రిల్ 01 ఆదోని డివిజన్ ఇంచార్జ్ గుమ్మల బాలస్వామి) మంగళవారం సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడి లకు జీతాలు పెంచాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రాజెక్టు కార్యాలయం ముందు రాష్ట్రవ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మన ఆదోని ప్రాజెక్ట్ కార్యాలయం ముందు అంగన్వాడీ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జీతాలు వెంటనే పెంచాలని తదితర సమస్యలు పరిష్కరించాలని సిడిపిఓ డిల్లేశ్వరి గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అంగన్వాడి వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే వెంకటమ్మ, సిఐటియు నాయకులు తిప్పన్న జె. రామాంజనేయులు. అంగన్వాడి యూనియన్ నాయకురాలు వరలక్ష్మి సరోజ మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అధికారం కు రాకముందు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారని ఆ హామీని అమలు చేయాలని ఇప్పటికీ 22 నెలలు కావస్తున్న అంగన్వాడీలకు మాత్రం వేతనం పెంచడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. కావున కూటమి ప్రభుత్వం వెంటనే ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ కంటే అదనంగా వెయ్యి రూపాయలు పెంచుతామన్న వేతనాల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని మే నెలలో వేసవి సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సెక్టార్ లీడర్లు పద్మ, కరుణ సోమక్క, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *