మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యల

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ 01-04-2026 మామిడిపెల్లి లక్ష్మణ్ మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని రాయికల్ సబ్ ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీసు సుదీర్ రావు పేర్కొన్నారు మంగళ వారం గాంధీ చౌరస్తాలో డ్రంకెన్‌ డ్రైవ్‌ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఇట్టి సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయి వాహన ప్రమాదాలు జరిగి వైద్యం ఖర్చులు అధిక భారంగా మారుతున్నాయి అని విలువైన ప్రాణాలు పోతున్నాయని అందరు జాగ్రత్తగా వాహనాలు నడుపాలని సూచించారు యువత మాదక ద్రవ్యాలకు మద్యానికి లాంటి అలవాట్లు దూరంగా ఉండాలి అని ఆయన అన్నారు ద్విచక్ర వాహనదారులు . నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది అర్జున్, సుమన్ కురుసం తిరుపతి మనోజ్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *