విద్యుత్ వర్కర్స్ చేస్తున్న సమ్మెకు మద్దతుగా నిలిచిన సిపిఐ పార్టీ

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 1 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పట్టణ కేంద్రం (డీ జీ ఎన్ పి డి సి ఎల్) (టి జీ ఎస్ పి డి సి ఎల్ ) లలో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న విద్యుత్ వర్కర్స్ తమకు కనీస వేతనాలు, విద్యార్హత ఉన్న ముందు నుండి పనిచేస్తున్న వారికి కన్వర్షన్ చేయాలి అంటూ వివిధ డి మాండ్లతో స్థానిక కరెంట్ ఆఫీస్ వద్ద చేస్తు న్న సమ్మెలో పాల్గొని సిపిఐ అశ్వారావుపేట మండల సమితి, ఏఐటియుసి సంపూర్ణ మద్దతు తెలియజేశాయి. సిపిఐ అశ్వారా వుపేట నియోజకవర్గం కార్యదర్శి సయ్యద్ సలీం మాట్లాడుతూ విద్యుత్ కార్మికులు చేస్తు e న్న ఈ సమ్మెకు తమ పూర్తి మద్దతు తెలియ జేస్తున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను, డిమాండ్లను తక్షణమే తీర్చాల ని ఆయన అన్నారు. తెలంగాణ విద్యుత్ ఆర్డిసన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టి వి ఏ ఈ జె ఏ సి ) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమ్మెకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ అశ్వారావుపేట మండల ఇన్చార్జ్ గన్నిన రామకృష్ణ, మండల కార్యదర్శి వగెల అర్జునరావు, అశ్వారావుపేట పట్టణ కార్యదర్శి నూకవరపు విజయకాంత్, ఏ ఐ టి యు సి నాయకులు చెన్నారావు, సిపిఐ నాయకులు, విద్యుత్ వర్కర్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *