టూ వీలర్ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం 01-04-2026 జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలోని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ట్రాఫిక్ .డీసీపీ. షెరీన్ బేగం.ఆదేశాల మేరకు జగ్గయ్యపేట మండలం లో చిలకల్లు గ్రామంలోని ఫ్లై ఓవర్ సర్కిల్. వద్ద ట్రాఫిక్ ఏసీపీ రామచంద్ర రావు. ట్రాఫిక్ సీఐ కృష్ణ . ఎస్ఐ.శ్రీనివాసరావు .. సిబ్బంది ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహన దారులకు ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతా నిబంధనలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని అధికారులు తెలిపారు. హెల్మెట్ ధరించని వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, అవసరమైన చోట జరిమానాలు విధించారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసులు పాల్గొని వాహనదారులకు సూచనలు అందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *