నడిగూడెం తహశీల్దార్‌గా సోమపంగు సూరయ్య బాధ్యతల స్వీకరణ

​* గతంలో వీఆర్వోగా, ఆర్‌ఐగా విశేష సేవలు.. ఇప్పుడు ఎమ్మార్వోగా బాధ్యతలు * ఉన్నతాధికారిగా రాకపై సర్వత్రా హర్షం

​పయనించే సూర్యడు 01-04-2026 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు నడిగూడెం మండల తహశీల్దార్ మరియు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ (ఎఫ్.ఏ.సి)గా సోమపంగు సూరయ్య మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గత కొంతకాలంగా ఈ పోస్టులో ప్రభుత్వం ఆయనను నియమించడంతో మండల రెవెన్యూ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు.సూరయ్య నడిగూడెం మండలంతో విడదీయలేని అనుబంధం ఉంది. గతంలో ఆయన ఇదే మండలంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గా, ఆపై రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ గా సుదీర్ఘ కాలం పనిచేశారు. ఇక్కడి భౌగోళిక పరిస్థితులు, భూ సమస్యలు మరియు ప్రజల అవసరాలపై ఆయనకు పూర్తి అవగాహన ఉండటం విశేషం. క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారి స్థాయి వరకు ఎదిగి, తిరిగి అదే మండలానికి తహశీల్దార్‌గా రావడం పట్ల స్థానిక ప్రజలు, నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని సామాన్య ప్రజలకు, రైతులకు రెవెన్యూ సేవలు మరింత వేగంగా అందేలా కృషి చేస్తానని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని, కార్యాలయానికి వచ్చే ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ​మండల స్థితిగతులపై పట్టున్న అధికారి రాకతో పాలన మరింత పారదర్శకంగా సాగుతుందని నడిగూడెం మండల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన సూరయ్య పలువురు రెవెన్యూ సిబ్బంది, స్థానిక ప్రముఖులు కలిసి పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *