నర్సరీని పర్యవేక్షించిన సర్పంచ్ గొడ్ల ప్రభాకర్, ఉప సర్పంచ్ కె.వి

కార్యక్రమంలో పాల్గొన్న పలువురు స్థానిక నాయకులు

పయనించే సూర్యుడు న్యూస్ :ఏప్రిల్ 2 ,తల్లాడ రిపోర్టర్ అన్నారుగూడెం గ్రామంలో నూతనంగా ప్రారంభించిన నర్సరీని ఆ గ్రామ సర్పంచ్ గొడ్ల ప్రభాకర్, ఉపసర్పంచ్ కొమ్మినేని వెంకటేశ్వర్లు స్థానిక నాయకులతో కలిసి మంగళవారం ఉదయం పర్యవేక్షించారు. క్రొత్తగా నింపిన బ్యాగులను వారు పరిశీలించి నీటి సౌకర్యాన్ని సమృద్ధిగా అందజేయాలని సెక్రెటరీ వెంకటేశ్వరరావుకు, గుమ్మస్తా రమేష్ కు, మరియు సిబ్బందికి సూచించారు.ఈ నర్సరీ మంచి ఏపుగా ఆరోగ్యవంతమైన మొక్కలకు ప్రోడక్టివిటీ కేంద్రంగా రూపొందాలని వారు అభిప్రాయపడ్డారు.ఆ విధంగా పరిసరాలును వినియోగంలోకి తీసుకురావాలని ఈ సందర్భంగా వారు సూచించారు. అన్నారుగూడెం నర్సరీ మండలంలోనే మంచి ఉన్నతమైన నర్సరీగా గుర్తింపు వచ్చే విధంగా ప్రత్యేక పని విధి విధానాలను రూపొందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గొడ్ల ప్రభాకర్, ఉపసర్పంచ్ కొమ్మినేని వెంకటేశ్వర్లు,వార్డు మెంబర్ సూదా హనుమంతరావు, సీనియర్ నాయకులు పులి వెంకట నరసయ్య,యువజన నాయకులు పొన్నం కృష్ణయ్య,గోవిందు శ్రీనివాసరావు ( ట్రాక్టర్ ),పులి శ్రీనివాసరావు,గొడ్ల వెంకటరత్నం, నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *