ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారులకు అందజేసిన కోరికాన శంకర్

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 2 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ 31వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్ లను లబ్ధిదారులకు బుధవారం టిడిపి నాయకులు కొరికాన శంకరరావు అందజేశారు. పలాస నియోజకవర్గ శాసనసభ సభ్యురాలు గౌతు శిరీష ఆదేశాల మేర ఈ కార్యక్రమం ను నిర్వహించామని శంకర రావు తెలిపారు. ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లను అందజేసినట్టు ఆయన తెలిపారు. సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొని పింఛన్ పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో స్థానికులు ఉత్సాహంగా పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *