14:50 లక్షలతో అభివృద్ధి పనికి భూమి పూజ: ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 2 కర్నూలు జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్. ఆదోని పట్టణంలో 19 వార్డు నందు దాదాపు 14 లక్షల 50 వేల రూపాయలతో 9 ఇంచుల త్రాగునీటి పైప్లైన్ ను వేయుటకు భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి మాట్లాడుతూ ఆదోని పట్టణంలోని నకాతే ఎస్టేట్ నందు త్రాగు నీటి పైపు లైన్ ను ఏర్పాటు కు భూమి పూజ చేశామని, ఆదోని నియోజకవర్గం లో జరుగుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ఎన్డీఏ కూటమి నాయకులు తెలుగుదేశం బిజెపి జనసేన మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొని అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అనంతరం ఆదోని అభివృద్ధి రాజకీయాల కతీతంగా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మునిసిపాల్ కమీషనర్ , ఎం ఈ, డి. ఈ. లు, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *