పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ తేదీ 2 రూలర్ రిపోర్టర్ ప్రతినిధి అల్లూరి సీతారామ జిల్లా అరకు వ్యాలీ మండల కేంద్రంలో (కొత్తవలస) కాఫీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, ఎకో-కాటేజీల టెండర్లను తక్షణమే రద్దు చేయాలి- ఆదివాసీ గిరిజన సంఘం అరకువేలి మండలం కొత్తవలస గ్రామంలో అత్యంత విలువైన 2.5 ఎకరాల గిరిజన భూమిని “కాఫీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ మరియు ఎకో-కాటేజీల” పేరుతో ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేయడానికి ఐటీడీఏ (ఐటీడీఏ) పాడేరు జారీ చేసిన టెండర్ ( ఆర్ ఎఫ్ పి) నోటిఫికేషన్‌ను ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది అరకువేలి గిరిజన సంఘం భవనంలో మీడియా సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల్లో తీసుకునే ఇటువంటి చర్య వల్ల ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లోని ఆదివాసీ స్వయంపాలన హక్కులను మరియు సుప్రీంకోర్టు తీర్పులను బేఖాతరు చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేసారు రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ ప్రకారం ఆదివాసీ ప్రాంతాల్లో భూమిపై పూర్తి హక్కులు గిరిజనులకే ఉంటాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక ‘సమత’ తీర్పు ప్రకారం.. షెడ్యూల్ ఏరియాలో ప్రభుత్వ భూమిని కూడా ప్రైవేట్ వ్యక్తులకు లేదా కంపెనీలకు లీజుకు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి లేదు. కేవలం గిరిజనులకు లేదా గిరిజన సహకార సంఘాలకు మాత్రమే ఇటువంటి ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత అప్పగించాలి. ప్రైవేట్ ఏజెన్సీల కోసం టెండర్లు పిలవడం ముమ్మాటికీ చట్టవిరుద్ధం మాని అన్నారు. పెసా (పి ఈ ఎస్ ఏ) చట్టం ప్రకారం షెడ్యూల్ ప్రాంతాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా, భూముల కేటాయింపులు చేసినా స్థానిక గ్రామసభల తీర్మానం తప్పనిసరి. చొంపి, కొత్తవలస గిరిజనుల అభిప్రాయం తీసుకోకుండా, గ్రామసభల అనుమతి లేకుండా ఏకపక్షంగా టెండర్లు ఎలా నిర్వహిస్తారాని ప్రశ్నించారు. కాఫీ సాగు ఆదివాసుల జీవనాధారం. కాఫీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ పేరుతో ఆదివాసీ ప్రాంత సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించడం వల్ల స్థానిక గిరిజనులు కేవలం కూలీలుగా మిగిలిపోతారు. 15 ఏళ్ల పాటు సుదీర్ఘ లీజుకు ఇవ్వడం అంటే అది గిరిజన భూములపై ప్రైవేట్ వ్యక్తుల ఆధిపత్యాన్ని శాశ్వతం చేయడమేనానీ విమర్శించారు. ఎకో-కాటేజీల పేరుతో 2.5 ఎకరాల్లో రిసార్టులు నిర్మించడం వల్ల అరకు ప్రాంత పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. పర్యావరణ హితమైన నిర్మాణాలు అని చెబుతున్నా, పర్యాటకం పేరుతో ప్రైవేట్ కంపెనీలు ఆదివాసీ సంస్కృతిని, అడవిని ధ్వంసం చేసే ప్రమాదం ఉందాని తెలిపారు.ఫిబ్రవరి 23, 2026న జారీ చేసిన అరకు కాఫీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ టెండర్ నోటిఫికేషన్‌ను తక్షణమే రద్దు చేయాలాని,ఆదివాసీ ప్రాంతాల్లోని పర్యాటక ప్రాజెక్టులను ప్రైవేట్ ఏజెన్సీలకు కాకుండా, స్థానిక గిరిజన యువతతో కూడిన సహకార సంఘాలకు లేదా గిరిజన కార్పొరేషన్లకు మాత్రమే అప్పగించాలని ప్రభుత్వం చట్టాలను గౌరవించకుండా ప్రైవేట్ కంపెనీలకు భూములు కట్టబెట్టాలని చూస్తే, ఆదివాసులకు ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతమన్నారు ఐటీడీఏ కేవలం గిరిజన సంక్షేమం కోసం పనిచేయాలి తప్ప, కార్పొరేట్ కంపెనీలకు ఏజెంట్‌గా వ్యవహరించకూడదని ఆదివాసీ గిరిజన సంఘం హెచ్చరిస్తోంది. ఈ టెండర్ల ప్రక్రియను నిలిపివేయకపోతే అల్లూరి జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు ఈ సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ ధర్మన్నపడాల్ మండల అధ్యక్షులు జి చినబాబు కార్యదర్శి జి బుజ్జిబాబు పాల్గొన్నారు