17 వార్డ్ లో ఇందిరమ్మ గృహప్రవేశంలో పాల్గొన్నకోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్జువ్వాడి నర్సింగ్ రావు

పయనించే సూర్యుడు,కోరుట్ల ఏప్రిల్ 2 ( చింతోజీ రాధాకృష్ణ ) కోరుట్ల పట్టణ 17 వార్డు గంగంపేట్ లో మండ జ్యోతి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న జువ్వాడి నర్సింగ్ రావు గృహ ప్రవేశంలో పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రత్యేక పూజలు చేసి ఇందిరమ్మ ఇంటి యజమాని మండ జ్యోతి కి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. వారు మాట్లాడుతూ గత పది సంవత్సర కాలంలో తెరాస పాలనలో తెరాస నాయకులు అవినీతికి పాల్పడి పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్నరే తప్ప పేదప్రజల అభివృద్ధి గురించి ఆలోచించలేదన్నారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానంతో ప్రతి పేదవాడి స్వంత ఇంటి కాల నెరవేర్చి రాష్ట్రం లో ప్రతి మహిళకు పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని ,ఇందిరమ్మఇంటి యజమాని మండ జ్యోతి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం లో మా స్వంత ఇంటి కల నెరవేరిందని నా కుటుంబం మొత్తం జువ్వాడి నర్సింగరావు,17 వార్డు కౌన్సిలర్ సోగ్రబి ,అక్బర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తేలుతున్నామని అన్నారు ఇట్టి కార్యక్రమం లో చైర్మన్ తిరుమల వసంత గంగాధర్ ,వైస్ చైర్మన్ షాహిద్, విజయ్, సమిద్, తబ్రేజ్,ర మేష్, రాములు శ్రీను, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *