పయనించే సూర్యుడు ఏప్రియల్ 2, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) చేనేత కార్మికులకు భరోసాగా ఉచిత కరెంటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లో ఆలోచన మేరకు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. బుధవారం ఆయన నివాసం వద్ద చేనేత కార్మికుల ఆధ్వర్యంలో ఉచిత కరెంటు పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మిక కుటుంబాలకు 93 వేల మంది లబ్ధిదారులు గుర్తించడం జరిగిందని మగ్గం ఉన్న చేనేత కార్మిక కుటుంబాలకు 200 యూనిట్లు నెలకి 720 రూపాయలు ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. అలాగే పవర్ యూనిట్ లో ఉన్నవారికి నెలకి 500 చొప్పున రాయితీ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. దీనికోసం ప్రభుత్వం 150 కోట్లు ఖర్చు చేస్తుందని అన్నారు. ఎవరైనా లబ్ధిదారులు ఉంటే తెలియజేస్తే వాన్ని గుర్తించడం జరుగుతుందన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం లో 59 కుటుంబాలను గుర్తించడం జరిగిందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మజ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, కూటమి నాయకులు పిల్లి సత్తిబాబు, నురుకుర్తి వెంకటేశ్వరరావు, కటకం శెట్టి బాబి, రంబాల వెంకటేశ్వరరావు, కరెడ్ల గోవిందు,చేనేత సహకార పిడి సత్యవేణి, ఎంపీపీ అనంతలక్ష్మి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.