బాణా సంచా ప్రమాద ఘటనపై సీట్ విచారణ..

పయనించే సూర్యుడు ఏప్రియల్ 2, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం లో ఫిబ్రవరి 28 జరిగిన బాణాసంచా పరిశ్రమ ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ (ప్రత్యేక విచారణ) బృందం బుధవారం విచారణ చేపట్టింది. ఈ విచారణలొ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేష్ కుమార్, ఈగల్ ఐ జి.ఆకే రవికృష్ణ వేట్లపాలెం లో ప్రమాదానికి గురైన బాణాసంచా పరిశ్రమ ప్రాంతాన్ని సందర్శించారు. స్థానిక షుగర్ ఫ్యాక్టరీ గెస్ట్ హౌస్ నందు వివిధ శాఖలకు చెందిన అధికారులతో విచారణ నిర్వహించారు. బాధిత కుటుంబాలతోను, ఆయా శాఖల అధికారులతోనూ మాట్లాడినట్లు అధికారి సురేష్ కుమార్ విలేకరులకు తెలిపారు. పరిశ్రమ యజమాని స్వార్థం, పరిమితికి మించి బాణాసంచా తయారీ కారణంగానే ప్రమాదం సంభవించిందని, ప్రమాదంలో 28 మంది మృతిచెందగా, ముగ్గురు బాధితులు కోలుకున్నట్లు సురేష్ కుమార్ తెలిపారు. ప్రమాదానికి పరిశ్రమ వద్ద భద్రత ఏర్పాట్లు లేకపోవడానికి ,అధికారుల వైఫల్యం కూడా కారణమని సురేష్ కుమార్ తెలిపారు. ప్రమాదానికి కారణమైన అన్ని విషయాలను పరిశీలిస్తున్నామని, ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి వివిధ అంశాలపై నిపుణుల అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరిగిందన్నారు. సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందిస్తామని సురేష్ కుమార్ తెలిపారు. ఈగల్ ఐజి ఆకే రవికిష్ణ, కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్, జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్, ఇతర అధికారులు పాల్గొన్నారు. పెద్దాపురం డిఎస్పి పనిచేసి ఈ ఘటనలో సస్పెన్స్కు గురైన శ్రీహరి రాజు, ఆర్డీవో శ్రీరమణి కూడా విచారణకు హాజరయ్యారు. సామర్లకోట తహసిల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ భగవాన్, వివిధ శాఖల అధికారులు పోలీసులు కూడా పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *