కస్తాల గ్రామంలో విద్యుత్ సమస్యలను పరిష్కరించిన మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి .

పయనించే సూర్యుడు చండూరు ఏప్రిల్ 02 . కస్తాల గ్రామపంచాయతీ పరిధిలోని విద్యుత్ సమస్యలను మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో కస్తాల గ్రామపంచాయతీ పరిధిలోని విద్యుత్ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకుపోగా మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సానుకూలంగా స్పందించి వెంటనే విద్యుత్ స్తంభాలను మంజూరు చేసి విద్యుత్ సమస్యలను పరిష్కరించారు. కస్తాల గ్రామపంచాయతీ కి మరియు గ్రామ పంచాయతీ పరిధిలోని బీసీ కాలనీలోమరియు ఎస్సి కాలనీలో నూతనంగా కరెంటు స్తంభాలను గ్రామ సర్పంచ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు కస్తాల గ్రామ ప్రజల విజ్ఞప్తుల మేరకు కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు, కరెంటు తీగల మార్పు, మరియు నిరంతర విద్యుత్ సరఫరాకు అవసరమైన చర్యలను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వేగవంతం చేస్తున్నారు. నాణ్యమైన విద్యుత్ అందించడం ప్రభుత్వ ప్రాధాన్యతగా వారు స్పష్టం చేస్తున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లేదన్న సత్యం,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కలిమికొండ మల్లేష్, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు మేకల సాగర్ రెడ్డి,కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు పంగ రామకృష్ణ , ఉప సర్పంచ్ కట్ట స్వర్ణ నర్సింహా , దోనాల శ్రీనివాస్ రెడ్డి, మెరుగు అంజయ్య, అమాలూరి అశోక్,గురజాల స్వామి , ధోనాల వెంకట్ రెడ్డి ,సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి జోగు రమేష్ ,సిపిఐ సీనియర్ నాయకులూ కట్ట యాదయ్య , కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *