పుంగునూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షులుగా విజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరణ.

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ ఏప్రిల్ 02.04.2026 మదనపల్లి జిల్లా పుంగనూరు నియోజకవర్గం ప్రతినిధి జె. నాగరాజ) అన్నమయ్య జిల్లా పుంగనూరు న్యాయవాదుల సంఘం అధ్యక్షులుగా ఎన్నికైన సీనియర్ న్యాయవాది విజయకుమార్, ప్రధాన కార్యదర్శి అరవింద్, ఉపాధ్యక్షులు గురుమూర్తి, బుధవారం న్యాయవాదుల సంఘం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చిత్తూరు జిల్లా జడ్జి అరుణ సారిక,ను మర్యాదపూర్వకంగా కలిసి పుంగనూరు కోర్టులో జడ్జిలు నియమించాలని వినతిపత్రం సమర్పించారు. జిల్లా జడ్జి అరుణ సారిక, సానుకూలంగా స్పందించి త్వరలోనే పుంగనూరు కోర్టులకు జడ్జీలు నియామకానికి హైకోర్టు దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇచ్చారని న్యాయవాదుల సంఘం అధ్యక్షులు విజయ్ కుమార్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *