ట్రస్ట్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి ఏప్రిల్ 2 నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు కోరారు. బుధవారం పట్టణంలోని శ్రీ దుర్గా మెస్ వద్ద కొండగట్టు పాదయాత్రకు వెళుతున్న హనుమాన్ దీక్ష భక్తులకు నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్పాహార పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ రఘు ఆంజనేయ స్వామి దీక్ష భక్తులకు అల్పాహారాన్ని పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుమారు గత పాతిక సంవత్సరాలుగా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పేద ప్రజలను ఆదుకున్నామని వివరించారు. ప్రజలు ట్రస్ట్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, ఆంజనేయ స్వామి దీక్ష భక్తులు, మున్సిపల్ కౌన్సిలర్ బొడ్ల ఆనంద్, మర్రి నర్సయ్య, కొయ్యల లక్ష్మణ్, ధర్మేందర్, దోమకొండ రమేష్, గన్నారపు వేణు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *