పయనించే సూర్యుడు, ఏప్రిల్ 02 రంగారెడ్డిజిల్లాప్రతినిధి(ఎస్ఎంకుమార్) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎంప్లాయ్ అయినా పల్లపు వడ్డే యాదయ్య పదవి విరమణ పొందిన సందర్భంగా ఆయనకు ప్రత్యేక శుభా కాంక్షలు తెలియజేసిన బిసి ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామ చందర్ యాదవ్ సెంట్రల్ యూనివర్సిటీ ఎంప్లాయిస్ యూనియన్ హక్కుల కొరకై పోరాటం చేసిన యాద య్య బీసీల కోసం తన వంతు పాత్ర పోషించాలని అన్నారు. జీవితంలో ఎన్నో ఒడిదుడు కులను కష్టసుఖాలను ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారని అన్నారు.రాష్ట్రం లో బీసీ ఐక్యత కోసం బీసీ హక్కుల కోసం జరు గుతున్న పోరాటంలో పల్లపు వడ్డే యా దయ్య లాంటి వ్యక్తులు తమ పాత్ర బీసీల పట్ల కృషి చేసే విధంగా ఉండాలని బీసీల ఐక్యత కోసం కృషి చేస్తారని ఈ సందర్భంగా ఆశిస్తున్నానని అన్నారు. ఉత్తమమైన నాయకత్వ లక్ష ణాలు కలిగిన పల్లపు వడ్డే యాదయ్య బీసీలకు ముందుండి నడిపించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ సిపి ప్రభాకర్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు పెరుగు ఐలేష్ యాదవ్, బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షులు నరసిం హులు యాదవ్, బీసీ జిల్లా నాయకులు కే నరసింహ యాదవ్ బుచ్చయ్య తెలంగాణ రాష్ట్ర యాదవ జేఏసీ ఉపాధ్య క్షులు పాములేటి యా దవ్ వంశీ యాదవ్,పల్లపు వడ్డే సంఘం నాయకులు తెల్లాపూర్ ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు ప్రజలు సెంట్రల్ యూనివర్సి టీ ఎంప్లాయిస్ యూని యన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు.