సప్పా నాగేశ్వరావు కి తెలుగు స్వర్ణ నంది పురస్కారం.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 2 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అయిన అమలాపురం పట్టణానికి చెందిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు, ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్ పర్సన్, వాకర్స్ ఇంటర్నేషనల్ ఎక్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సప్పా నాగేశ్వరరావు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా మార్చి 29 ఆదివారం ప్రకాష్ నగర్ ధర్మం చర కమ్యూనిటీ హాల్ లో జరిగిన ఫిలిం త్రో ఫిక్స్ సొసైటీ వ్యవస్థాపకుడు డా అద్దంకి రాజయోనానిర్వహణలో జరిగిన ఉగాది నంది అవార్డు ల ప్రధాన సభ లో అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళావేదిక జాతీయ అధ్యక్షుడు డా కత్తి మండ ప్రతాప్ ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా ఉగాది నంది పురస్కారం నీ శ్రీ సప్పా నాగేశ్వరరావు అందుకున్నారు ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, డిప్యూటీ గవర్నర్, సంఘసేవకర్త,అంబేద్కర్ కోనసీమ, జిల్లా రెడ్ క్రాస్ ట్రెజరర్ జల్లి సుజాత బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నర్సిపల్లి హారిక, టీ డీ పీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ కాశి నవీన్ కుమార్, పిఠాపురం సంస్థనా రాజ వంశీకులు డా శ్రీ రాజా రావు వెంకట మహిపతి రామరత్నరావు బహదూర్, శ్రీ శ్రీనాథ కవి సార్వభౌమ వారి 13 వ తరం వారసులు డా కావూరి శ్రీనివాస శర్మ, భక్త రామదాసు వారి 10 వ తరం వారసులు శ్రీ కంచర్ల శ్రీనివాస్ గారు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *