బిఆర్ఎస్ బీసీ సెల్ మండల అధ్యక్షుడుగా పురుగుల నర్సింహ్మ ముదిరాజ్

పయనించే సూర్యుడు ఏప్రిల్ 2 2026 నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలో ఇటీవలే కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గురక జైపాల్ యాదవ్ బిఆర్ఎస్ వెల్దండ మండల కమిటీ ప్రకటించారు. అందులో భాగంగానే బిఆర్ఎస్ కు అనుబంధ సంస్థగా పనిచేసే బీసీ సెల్ మండల అధ్యక్షుడిగా చెరుకూరు గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ పురుగుల నరసింహ ముదిరాజ్ ను ప్రకటించారు. బిసి సెల్ మండల అధ్యక్షులుగా ప్రకటించినందుకు నరసింహ ముదిరాజ్ పార్టీకి నిబద్ధతగా పని చేసినందుకుగాను ఈ పదవి వచ్చిందని, ఇందుకు మాజీ ఎమ్మెల్యే గుర్కా జైపాల్ యాదవ్ కు, రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్, మాజీ జెడ్పిటిసి సభ్యురాలు విజితా రెడ్డిలకు, నరసింహ ముదిరాజ్ ప్రత్యేక కృతజ్ఞతాభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *