పెద్దకడబూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ

పయనించే సూర్యుడు న్యూస్ మార్చి 02 రిపోర్టర్ అభి పెద్దకడబూరు మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం బుధవారం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి, తుంగభద్ర డిప్యూటీ చైర్మన్ నరవ రమాకాంత్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారులతో మమేకమై వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎంతో మేలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా ప్రతి నెలా పింఛన్లు సమయానికి అందడం వల్ల లబ్ధిదారులు ఆర్థికంగా కొంత భరోసా పొందుతున్నారని వివరించారు. నరవ రమాకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందేలా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి లోపాలు లేకుండా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *