
పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఏప్రిల్ 02. కస్తాల గ్రామంలో పల్లె ప్రగతిలో భాగంగా ఏర్పాటు చేసిన నర్సరీ ను చండూరు మండల ఎంపీడీవో బి .యాదగిరి సందర్శించారు .నర్సరీలో నాటిన మొక్కలను సంరక్షించాలని చండూరు మండల ఎంపీడీవో బి .యాదగిరి అన్నారు. మండలంలోని కస్తాల గ్రామ పంచాయతీలో బుధవారం ఆయన నర్సరీ ను సందర్శించి సూచనలు చేశారు. వాతావరణ సమతుల్యతకు మొక్కలు నాటడం ఎంతో అవసరమని అన్నారు. నర్సరీలో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మొక్కలు ఎదిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు . నర్సరీలలో పెరుగుతున్న మొక్కలను పరిశీలించారు. క్షేత్ర సహాయకులకు పలు సూచనలు చేశారు. మొక్కలు ఎండిపోకుండా ప్రతిరోజు మూడు పూటలా నీరు పట్టాలని వర్షాకాలం నాటికి సిద్ధం చేయాలని తెలిపారు. ఒక మొక్క చనిపోయిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్శనల్లో మొక్కల సంరక్షణ, నాణ్యత, ఉపాధి హామీ పనుల నిర్వహణ, మరియు రికార్డులను పరిశీలించి, క్షేత్ర సహాయకులకు అవసరమైన సూచనలు ఇస్తున్నారు .ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లేదన్న సత్యం,గ్రామ పంచాయతీ సెక్రటరీ రాజేష్ ,కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు మేకల సాగర్ రెడ్డి,కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు పంగ రామకృష్ణ ,కాంగ్రెస్ పార్టీ నాయకులూ దోమల శ్రీనివాస్ రెడ్డి, గురిజాల స్వామి,ఆకారపు మల్లయ్య,గ్రామపంచాయతీ సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు.