శస్త్రచికిత్స అనంతరం జొన్నలగడ్డ శ్యాం ను పరామర్శించిన ప్రత్తిపాటి పుల్లారావు…

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 3 యడ్లపాడు మండల ప్రతినిధి.. చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలోని యడ్లపాడు మండలం, సంతపేట గ్రామానికి చెందిన జొన్నలగడ్డ శ్యాం ఇటీవల గుండెకు సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేందుకు ఈరోజు మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు వారి నివాసానికి వెళ్లి వ్యక్తిగతంగా పరామర్శించారు. ఈ సందర్భంగా శ్యాం ఆరోగ్య పరిస్థితిని వైద్యుల సూచనల ప్రకారం జాగ్రత్తగా చూసుకోవాలని కుటుంబ సభ్యులకు సూచిస్తూ, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే అవసరమైన సహాయం ఏదైనా ఉంటే తప్పకుండా అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో టీడీపీ పార్టీ యడ్లపాడు మండల అధ్యక్షుడు కామినేని సాయిబాబు కూడా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, పార్టీ తరఫున శ్యాం కు అండగా ఉంటామని తెలిపారు. గ్రామ నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని, శ్యాం ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షించారు. ఈ పరామర్శ కార్యక్రమం ద్వారా నాయకులు ప్రజల పట్ల చూపుతున్న మానవతా దృక్పథం స్పష్టంగా కనిపించిందని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *