పయనించే సూర్యడు న్యూస్ గజ్వెల్ ఏప్రిల్ 3 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ డివిజన్ పరిధిలో ని పరిధిలోని మండలంలోని పురుగు మందుల దుకాణాలో వ్యవసాయ శాఖఏ డి ఏ బాబు నాయక్ అధర్యంలో తనిఖీలు నిర్వహించరూ ఈ సందర్బంగా అధికారులు, గజ్వేల్ మండలంలో గజ్వేల్ ఎడిఎ బాబు నాయక్,గజ్వేల్ ఎఓ నాగరాజు సంయుక్తంగ తనిఖీలు నిర్వహించి పారాక్వాట్ గడ్డి మందును 60 రోజుల వరకు ప్రభుత్వ ఆదేశానుసారం జి ఓ 24, తేది 31.03.2026, ప్రకారం *అమ్మకపు నిలుపుదల నోటీసు.తదుపరి ఉత్తర్వులు వచ్చెవరకు జారీ చేయనైనది , దీని వలన నష్టాలు: 1.వాతావరణ కాలుష్య పెరుగుతుంది. 2.మనుషులకు ఆరోగ్య కేన్సర్ పెరుగుతుంది.
3.ఇట్టి గడ్డి మందును రైతులు పంటలపై ,పంట పొలాల్లో పీచికారి చేసినచో పంటల నుండి వచ్చే అహరపు దాన్యాలు కలుషితమై మనుషులకు ఆరోగ్యానికి వ్యాధులు సంక్రమించె అవకాశాలు అధికంగ ఉంటాయి. 4ఇట్టి గడ్డి మందు వాడకం వలన పశువులకు ఆరోగ్యకరమైన వ్యాధులు సంక్రమించి దాని ద్వార మానవాలికి అరోగ్య సమస్యలు సంక్రమించె అవకాశాలు అధికంగా ఉంటాయి. కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.గడ్డి మందును రైతులకు వ్యవసాయ వాడకాన్ని అమ్మకముబ్యాన్ నిషేద్దించడం GOMS NO. 24 తేది:31.03.2026 ద్వార జరిగినది.కాగా రైతు సోదరులు ఎవరు కూడ గడ్డి మందును కోనుగోలు చేయరాదని అయన హెచ్చరిక చేసారు ఎవరు డీలర్లు అధికారుల నియమ నిబంధనలు అతిక్రమించి అమ్మినచో వారు శాఖ పరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎఓ నాగరాజు, ఎఈఓ నర్సింలు ,డీలర్లు పాల్గొన్నారు.